

జనం న్యూస్ జనవరి 24 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- ఆసిఫాబాద్ మండలం అడ గ్రామ శివారులో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ఆసిఫాబాద్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆసిఫాబాద్ సిఐ రవీందర్ కు వచ్చిన సమాచారం మేరకు ఆసిఫాబాద్ ఎస్సై ప్రశాంత్ తన పోలీస్ సిబ్బందితో కలసి శుక్రవారం సాయంత్రం అడ గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 9 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.10,800 నగదు,3 ద్విచక్ర వాహనాలు, 4మొబైల్ పోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రవీందర్ తెలిపారు. 9 మందిపై కేసు నమోదు చేశామన్నారు..అదే విధంగా ఆసిఫాబాద్ మండలంలో ఎక్కడైనా పేకాట ఆడినట్లు తెలిస్తే 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు.