Listen to this article

జనంన్యూస్. 28.సిరికొండ. ప్రతినిధి.

నిజామాబాద్ రూరల్నియోజకవర్గం లోని సిరికొండ మండలం. న్యావనంది మరియు రావుట్ల గ్రామల లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి MRPS జిల్లా ఇన్చార్జ్ కుడాల స్వామి మరియు MRPS సిరికొండ మండల అధ్యక్షులు మొట్టల దీపక్. నక్క రాజేశ్వర్ న్యావనంది గ్రామ మాదిగ పెద్దలతో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో సాధించుకున్న విజయాలు పోరాటాలు ఇప్పుడిప్పుడే సాధించుకున్న ఏబీసీ వర్గీకరణ విషయమై మాదిగ పెద్దలతో చర్చించి వారికి అవగాహన కల్పించి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జెండా దిమ్మె నిర్మించి జులై ఏడో తారీఖు దండోరా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జండా ఎగరేసి సంబరాలు జరుపుకోవాలని కోరడం జరిగింది దీనికిగాను న్యావనంది. రావూట్ల గ్రామ మాదిగ పెద్దలు ఆమోదం తెలిపి నూతన గద్దె నిర్మాణం చేపట్టి ఏడో తారీఖు జులై న ఆవిర్భావ దినోత్సవ సంబరాలు జరుపుకుంటామని తెలిపినారు ఎమ్మార్పీఎస్ న్యావవనంది మరియు రావుట్ల గ్రామ కమిటీ వేయడం జరిగింది న్యవనంది గ్రామ అధ్యక్షులుగా గౌరీ గంగస్వామి. ఉపాధ్యక్షులుగా ఉల్లంగి గణేష్. ప్రధాన కార్యదర్శి గౌరీ సురేష్ ను మరియు కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది