Listen to this article

( జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్)

జనం న్యూస్, జూన్ 28, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ నాయకత్వంలో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రివర్యులు అపర చాణిక్యుడు అమిత్ షా వస్తున్న రైతు సమ్మేళనాన్ని విజయవంతం చేయగలరని బిజెపి జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు మరియు కోరుట్ల నియోజకవర్గం నాయకులు చిట్నేని రఘు కోరుట్ల నియోజకవర్గ ప్రజలను రైతులను నాయకులను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ కోరుట్ల అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఏలేటి నరేందర్ రెడ్డి జిల్లా నాయకులు చింతల శ్రీకర్ గౌడ్ తుకారం గౌడ్ పట్టణ ప్రధాన కార్యదర్శి సుంకేటి విజయ్ తదితరులు పాల్గొన్నారు