Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 28 రిపోర్టర్ సలికినీడి నాగు

యడ్లపాడు మండలంలోని శ్రీలక్ష్మి మెడికల్ షాపులో వైద్యం పేరుతో పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల జీవితాలతో చెలగాటంవాడుతున్నారు.ఇటీవల బాలిక నిండు ప్రాణం బలిగొన్న సంఘటన జరిగింది.. జగ్గాపురం గ్రామానికి చెందిన బొంతు షాలిని(9) అనే బాలిక అనారోగ్యంతో శ్రీలక్ష్మి మెడికల్స్ షాపుకి ఈ నెల 17 వ తేదీ రాగా మెడికల్ షాపు యజమాని సురేష్ ఇంజక్షన్ చేసినట్లు,ఆ ఇంజక్షన్ తో రియాక్షన్ రావడం తో స్థానిక వైద్యశాలకు తీసుకువెళ్లగా గుంటూరు తీసుకు వెళ్ళవలసిందిగా డాక్టర్ లు సూచించారు.ఆ తదుపరి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.చికిత్స పొందుతూ మృతి చెందారు. దీనితో బాలిక మృతి చెందటానికి ఇంజక్షన్ రియాక్షన్ కారణమని ఆరోపిస్తూ ఆ బాలిక కుటుంబ సభ్యులు మెడికల్ షాపు ఎదుట బాలిక పార్ధివ దేహాన్ని ఉంచి ధర్నా చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకొని మెడికల్ షాప్ యజమాని పై కేసు నమోదు చేశామని అన్నారు. ఏ విధమైన కేసు నమోదు చేశారో పాత్రికేయులకు వివరాలు వెల్లడించకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తుందని ప్రాంత ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.మెడికల్ షాపు యజమాని పై వెల్లువెత్తుతున్న విమర్శలు.మెడికల్ షాపు యజమానికి వైద్యం చేసేందుకు ఎటువంటి అనుమతులు లేవని, అనుమతులు లేకుండానే మండలకేంద్రంలో నిర్భయంగా వైద్యం చేస్తున్నా ,వైద్య శాఖ అధికారులు పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ వైద్య ఉన్నతాధికారులు ఈ సంఘటన జరిగిన రోజు సంబంధిత మెడికల్ షాపు యజమానిని పిలిచి విచారించామని,మెడికల్ షాపు కు అనుమతులు ఉన్నాయని, కేసు నమోదు చేయిస్తున్నామని చెప్పి వెళ్లిపోయారు. బాలిక మృతికి కారకులైన మెడికల్ షాపు యజమాని పై వైద్య శాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో.. కనీస సమాచారం పాత్రికేయులకు చెప్పకపోవడం గమనార్హం.*మెడికల్ షాపు నిర్వాహకులు వైద్యం ఎలా చేస్తారు.. లైసెన్స్ రద్దు చేయాలి. కొండ్రముట్ల నాగేశ్వరరావు డిమాండ్. ప్రధమ చికిత్స చేయాలంటే గుర్తింపు పొందిన డాక్టర్ వద్ద కనీసం 10 సంవత్సరాలుపని చేసినట్లు ఆడాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వాలి.. కాంపౌండర్ గా 10 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తికి రోగి స్థితిగతులు ఎంతో కొంతఅర్థమవుతుంది. దానిని బట్టి వైద్యం అందించే అవకాశం ఉన్నదా క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి పంపించాలా లేదా అనేది ఒక అవగాహనకు రావాలి. అంతేకానీ మెడికల్ షాపుల్లో కొన్ని రోజులు పని చేసి బయటకు వచ్చి షాపులు పెట్టి వైద్యం చేస్తే ప్రజల ప్రాణాల పరిస్థితి ఏమిటని శ్రీ సాయి వెంకటేశ్వర కాంపౌండర్స్, నర్సుల అసోసియేషన్ అధ్యక్షులు కొండ్రముట్ల నాగేశ్వరరావు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆసుపత్రుల్లో కొందరు కొద్దిరోజులు మాత్రమే పని చేసి సరైన అవగాహన లేకుండా వైద్యం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. బాలిక ప్రాణాలు తీసిన మెడికల్ షాపు యజమాని లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.