

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, (భండా రామ్), జనవరి 24 (జనం న్యూస్):- జిల్లా విద్యాశాఖ అధికారిగా ఉన్న రజనీకాంత్ ప్రవీణ్ అక్రమంగా ఆస్తులపై ఫిర్యాదు రావడం వల్ల కేసు నమోదు చేసిన విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. బీహార్ ప్రాంతంలోని రజనీకాంత్ ప్రవీణ్ బసంత్ ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. లెక్కకు మించిన ఆస్తులను కూడబెట్టారు. ఈ నేపథ్యంలోనే సోదాలు నిర్వహించారు విజిలెన్స్ అధికారులు. దీంతో కోట్ల విలువైన నగదు దొరికినట్లు సమాచారం. ఇంటి లోపల పోలీసు బలగాలను మోహరించారు. అందిన సమాచారం మేరకు విద్యాశాఖ అధికారి రజనీకాంత్ ప్రవీణ్‌కు చెందిన ఇంటితోపాటు పలు చోట్ల పోలీసులు, విజిలెన్స్ బృందాలు దాడులు చేస్తున్నాయి