

జనంన్యూస్,జూన్29,అచ్యుతాపురం:ఆంధ్రప్రదేశ్సాంప్రదాయ మత్స్యకార కులాల సమాఖ్య సంఘం ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మత్స్యకార కులాలైన, వాడబజ్జి, పల్లె, బెస్త, నేయ్యల, అగ్రి కుల క్షత్రీయ,జాలారిమొదలగు మత్స్యకార కులాలకు చెందిన 14 ఉప కులాలు మత్స్యకారులంతా సమావేశంలో చర్చించినవిషయాలు మత్స్యకారులంతా ఏకమవ్వాలని ఐకమత్యంగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందిపుచ్చుకొని మత్స్యకార పిల్లలంతా బాగా చదివించి, ఉన్నత ఉద్యోగులుగా తీర్చిదిద్దాలనితద్వారా మత్స్యకారులకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుండి రావలసిన వృత్తిపరమైనటువంటి పరికరాలు,వలలు, ఇంజన్లు,తెప్పలు,ఐస్ బాక్సులు, అలాగే మత్స్యకార భరోసా లాంటి పథకాలు అన్నీ కూడామత్స్యకారులు అందిపుచ్చుకొని వృద్ధిలోకి రావాలని,14 కులాల మత్స్యకారులు ఐక్యమత్యంగాఉండి ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార సంఘాన్ని బలోపేతం చేయాలన్నారు.రాష్ట్ర కమిటీ అధ్యక్షులు నడికుదుటి అర్జున్ రావు సమక్షంలో అధ్యక్షులుగా మాతా గురునాథరావు,అనకాపల్లి జిల్లా అధ్యక్షులుగా చోడిపల్లి దేముడు,ప్రధాన కార్యదర్శిగా ఒలిశేట్టి అప్పలరాజు,కోశాధికారిగా బెరా శీను,జిల్లా ఉపాధ్యక్షులుగా ఏరిపల్లి అజయ్,జిల్లా కార్యదర్శిగా మోస సతీష్,జిల్లా ఉపాధ్యక్షులుగా మల్లి లోవరాజు,జిల్లా ఉపాధ్యక్షులుగా కొవిరి రమణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలోసర్పంచులు,ఎంపీటీసీలు, కుల పెద్దలు తదితర మత్స్యకార నాయకులు పాల్గొన్నారు.