Listen to this article

జూన్ 28 జనం న్యూస్కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలోని దాబాలలో మద్యానికి అనుమతులు లేదని బిచ్కుంద సీఐ జగడం నరేష్ పేర్కొన్నారు. ఈరోజు బిచ్కుంద సర్కిల్ కార్యాలయంలో దాబా హోటల్ యజమానులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాబా హోటల్లో మద్యం సేవించరాదని, మద్యం అమ్మ రాదని తెలిపారు. మద్యం అమ్మినట్లు తెలిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకొని దాబాలను సీజ్ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎస్సై భువనేశ్వర్, బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.