

విలువైన మెడికల్ సామాగ్రి ఎక్కడ?
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి (భండా రామ్), జనవరి 24 (జనం న్యూస్):- మార్కాపురం: చరిత్ర కలిగిన ప్రభుత్వ భవనం రాత్రికి రాత్రే కూల్చివేతకు రంగం సిద్ధం…? పట్టణ నడిబొడ్డు కంభం సెంటర్ లో ఉన్న అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ ను దగ్గరుండి నేలమట్టం చేయిస్తున్న అధికారులు…? చిన్నారులకు వేసే వ్యాక్సినేషన్లు, పలు రికార్డులు, ఫ్రిజ్లు సైతం ఉన్న సంబంధిత శాఖ అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఉన్నపలంగా జెసిబిలతో నేలమట్టం..? ఉన్నతాధికారులు నేలమట్టం చేయించడంలో ఆంతర్యం ఏమిటో అని చర్చించుకుంటున్న పుర ప్రజలు.