Listen to this article

జూలై 1వ తారీఖున వైసీపీ సీనియర్ నాయకులు బొల్లా బాలిరెడ్డి జన్మదిన వేడుకలు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గిద్దలూరు నియోజకవర్గం పబ్లిసిటీ విభాగం అధ్యక్షులు బొల్లా బాలిరెడ్డి.

ఆరు మండలాల మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు బాలిరెడ్డి.

బేస్తవారిపేట ప్రతినిధి, జూన్ 30 (జనం న్యూస్):

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామానికి చెందిన బొల్లా బాలిరెడ్డి వైసీపీ పార్టీకి విశేష సేవలు అందిస్తూ తనదైన శైలిలో 1991 నుండి రాజకీయ అరంగేట్రం చేసి మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ గానూ, పూసలపాడు సర్పంచ్ గాను, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బేస్తవారిపేట మండల కన్వీనర్ గా 2023 వరకు, ప్రజెంట్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గిద్దలూరు నియోజకవర్గం పబ్లిసిటీ విభాగం అధ్యక్షులు గాను కొనసాగుతున్నారు.. 1991 నుండి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ప్రజల కార్యకర్తల అభిమానాన్ని చూరకొన్న ఏకైక వ్యక్తి బొల్లా బాలిరెడ్డి . నీతి నిజాయితీగా నాకు కల్పించినటువంటి పదవులకు నూటికి నూరు శాతం కార్యకర్తల సహాయ సహకారాలతో పార్టీ బలోపేతానికి పార్టీ తరఫున పోటీచేసిన ప్రతి ఒక్కరిని గెలిపించేందుకు నా సాయి శక్తుల కృషి చేస్తున్నాను. ఇప్పటివరకు కూడా తనదైన శైలిలో అదే స్ఫూర్తితో అందరి కంటే పార్టీ కార్యక్రమాలకు ముందంజలో, అలాగే జగన్ అంటే ఎనలేని ప్రేమ, అభిమానాలు ఉన్న వ్యక్తి. ఈ సందర్భంగా గిద్దలూరు నియోజకవర్గంలో బొల్లా బాలిరెడ్డి అంటే ఒక స్ఫూర్తి, ఒక నిజాయితీ, ఒక నిలువుటద్దం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 1వ తేదీన జన్మదిన వేడుకలు బేస్తవారిపేట మాజీ సైనికుల సంక్షేమ కార్యాలయంలో ఘనంగా నిర్వహించనున్నారు.