

జనం న్యూస్ జూన్ 30 సంగారెడ్డి జిల్లా
పటాన్ చెరు మండలం పాశ మైలారం పారిశ్రామికవాడలో సోమవారం ఉదయం సిగాచి కెమికల్స్ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సిగాచి కెమికల్స్ లో ప్రమాదవశాత్తు రియాక్టర్ పేలడంతో పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుందనీ పోలీసులు తెలిపారు. సిగాచి పరిశ్రమ అగ్నిప్రమాదం జరిగిన సంఘటనా స్థలానికి జిల్లా ఎస్పీ పంకజ్ పరితోష్ చేరుకొని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనలో పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు మంటల్లో చిక్కుకున్నారనీ, ఇప్పటికే 10 మంది మృతి చెందినట్లుగా వారు తెలిపారు. ఇంకా కొంత మంది కార్మికులు మంటల్లో చిక్కుకోగా పరిశ్రమ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, పోలీసుల, మరియు స్థానికుల సహాయంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది
