

కనిపిస్తే సమాచారం ఇవ్వండి ప్లీజ్..!!
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జనవరి 24 (జనం న్యూస్):- మార్కాపురం: పట్టణంలోని తూర్పు వీధి కి చెందిన గాయం వెంకటేశ్వర రెడ్డి గత రెండు రోజులుగా కనిపించడం లేదు అని తల్లి తండ్రులు తెలిపారు. పట్టణంలోని శ్రీ మార్కండేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి సేవలు చేసుకుంటూ ఉంటుంటాడు అని,రెండు రోజుల బట్టి ఆలయానికి రావడం లేదని ఆలయ పూజారులు చెప్పారు. ఇతను ఎక్కడన్నా కనపడితే ఫోటో కింద ఉన్న నెంబర్ కి దయచేసి ఫోన్ చేయవలసిందిగా తల్లిదండ్రులు కోరుచున్నారు