Listen to this article

5 బైకులు స్వాధీనం

జనం న్యూస్,జూన్30,అచ్యుతాపురం:

అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలు మేరకు, ఆడిషినల్ ఎస్పీ క్రైమ్స్ మోహన్ రావు అధ్వర్యంలో పరవాడ ఇంచార్జి డీఎస్పీ మోహనరావు,డిటిసి,డిఎస్పీ అనకాపల్లి సూచనలు మేరకు,30 వ తేదీ అనగా ఈరోజు ఉదయం 08-30 గంటలకు సీఐ నమ్మి గణేష్ మరియు ఎస్ఐ సుధాకర్ మరియు సిబ్బంది అచ్యుతాపురం నాలుగు రోడ్లు జంక్షన్ వద్ద వాహనములు తనిఖీ చేయుచుండగా,పరవాడ వైపు నుండి టివిఎస్ ఎక్స్ఎల్ నడుపుకొంటూ ఒక వ్యక్తి అచ్యుతాపురం నాలుగు రోడ్ల జంక్షన్ వైపు సిబ్బందిని చూచి టివిఎస్ ఎక్స్ఎల్ ఆపి వస్తూ, వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో పారిపోవుతుండగాగా, పారిపోయిన వ్యక్తిని పట్టుకోవడం జరిగిందని, ఆ వ్యక్తిని పేరు, చిరునామా అడుగగా రెడ్డి పైడం నాయుడు,చరకం గ్రామం,కశింకోట మండలం అని చెప్పాడని,తదుపరి విచారణ చేయగా అచ్యుతాపురంలో టివిఎస్ ఎక్స్ఎల్,ఎస్ రాయవరం మండలం, అడ్డు రోడ్ బ్రిడ్జ్ క్రింద గ్లామర్ బ్లూ బైక్,పరవాడ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 158/25 కేసులో దొంగిలించబడిన బైక్,శంకవరం పోలీస్ స్టేషన్ పరిధిలో AP31CG7742 నెంబర్ బైక్,తుని పోలీస్ స్టేషన్ పరిధిలో ఏపి 05886851 నెంబర్ బైక్ లను అతను వేరువేరు చోట్ల మొత్తం 5 బైక్స్ దొంగతనం చేసానని
చెప్పడం జరిగిందని, పై ప్రాపర్టీని మరియు దర్యాప్తు నిమిత్తం ముద్దాయిని అరెస్ట్ చేయడమైనదని పోలీసులు తెలిపారు. పై కేసును చేధించిన అచ్యుతాపురం పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అభినందించారు.