Listen to this article

ఒంగోలు ప్రతినిధి, జూన్ 30 (జనం న్యూస్):

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో, పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు వెన్నపూస రవీంద్రా రెడ్డి ఆదేశాలతో కూటమి ప్రభుత్వానికి పలు డిమాండ్ లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు.

మాజీ ఎంపీపీ, ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు నన్నెబోయిన
రవికుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు.

వినతి పత్రం లోని పలు డిమాండ్లు

రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతిపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేయించాలి. ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్. చట్టం మేరకు ఉపాధి హామీ పనులు గ్రామ పంచాయితీల ద్వారానే జరిపించాలి – కూలీలకు సకాలంలో బిల్లులు చెల్లించాలి. సర్పంచులకు తల్లికి వందనం పథకాన్ని తక్షణమే వర్తింపచేయాలి. కేంద్రం విడుదల చేసిన, 15వ ఫైనాన్స్ కమిషన్ విడుదల చేసిన నిధులు 1,150 కోట్లు స్థానిక సంస్థలకు తక్షణమే జమచేయాలి. ఈ బిల్లుల చెల్లింపుల్లో రాజకీయ జోక్యం నివారించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 73, 74 సవరణల మేరకు సర్పంచులకు ఉన్న అధికారాలను అమలు చేయాలి. జీఓ ఎం.ఎస్. నెం. 11 ని రద్దుపరిచి గాలిలో ఉన్న 1,350 మంది పంచాయితీ సెక్రటరీలకు పోస్టులు ఇచ్చి, 10 నెలలుగా పెండింగులో ఉన్న జీతాలను విడుదల చేయాలి. కూటమి ప్రభుత్వ హామీ మేరకు, గ్రామాల్లో వసూలు చేస్తున్న ఇంటి పన్నులను స్థానిక సంస్థల ఖాతాల్లో జమచేయాలి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలకు గౌరవ వేతనాలు వెంటనే పెంచాలి. ప్రస్తుతం అమలులో ఉన్న గౌరవ వేతనాలను సకాలంలో చెల్లించాలి.

ప్రకాశం జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేసిన వారిలో ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షులు నన్నెబోయిన రవి కుమార్ యాదవ్, బేస్తవారిపేట ఎంపీపీ, పంచాయతీ రాజ్ రాష్ట్ర కార్యదర్శి వేగినాటి ఓసూరా రెడ్డి, ఒంగోలు నియోజక వర్గ పంచాయతీ రాజ్ అధ్యక్షులు కోటేశ్వర రావు, సంతనూతలపాడు నియోజక వర్గ పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షులు, దర్శి నియోజకవర్గం పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షులు సుబ్బారెడ్డి, గిద్దలూరు నియోజక వర్గ పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షులు మల్లెల శేఖర్ రెడ్డి, బేస్తవారిపేట జడ్పీటీసీ సభ్యులు బండ్లమూడి వెంకట రాజయ్య, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వెన్నా భాస్కర్ రెడ్డి, పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.