

జనం న్యూస్ 01 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
ఇళ్ళు కట్టుకోవాలని నాడు ఇదే అధికారులు పదే పదే ఒత్తిడి చేసి తమతో అప్పులు చేయించి మరీ ఇళ్ళు కట్టించారాని, వేలకు వేలు అద్దె లు చెల్లించలేక సొంత ఇళ్ళు కట్టుకుంటే కనీస సదుపాయాలు కల్పించడం లో ప్రస్తుత పాలకులు చిన్న చూపు చూడటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గుంకాలం జగనన్న కాలనీ వాసులు ఆందోళన వ్యకం చేశారు. ఈమేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు సందర్బంగా కాలనీ మహిళలందరు మాట్లాడుతూ కాలనీలో వర్షం పడితే రోడ్డు బురద మాయంగా మారిపోతుందని, వృద్ధులు, చిన్నారులు జారి పడిపోతున్నారన్నారు. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి దాపురించందన్నారు. చీకటి పడితే లైట్స్ పని చేయవని, లైట్ పోతే కొత్తది మార్చడానికి విధ్యుత్ శాఖ కి సంబంధం లేదని చెబుతున్నారని, మున్సిపల్ అధికారులకు చెప్పుకోవాలని చెబుతున్నారన్నారు. ఇక దొంగల భయం ఎక్కువగా ఉందని తాగు నీటికి సంబంధించి జనా వాసాలు ఉన్న చోట బోర్లు అయినా వేయించాలని కోరారు. రాత్రి వేళల్లో ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఎం చేయాలో కూడా అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక 108 అంబులెన్సు, అర్ ఎం పి వైద్యులను అందుబాటులో ఉంచాలని కోరారు. రేషన్, పింఛను అందరికి అందేలా చూడాలని కోరారు. ప్రస్తుత పాలకులు, అధికారులు తమ పట్టించుకుని తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ కి వినతినిచ్చారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో గుంకాలం కాలనీ వాసులు పాల్గొన్నారు.