

జనం న్యూస్ 01 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
జూలై9న జరిగే జాతీయ సమ్మెలో ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఆయాలు పాల్గొంటున్నారని యూనియన్ జిల్లా కార్యదర్శి బి.సుధారాణి తెలిపారు. జిల్లా ఉప విద్యాశాఖ అధికారి వెంకటరమణకు సోమవారం సమ్మె నోటీసు ఇచ్చారు. కనీస వేతనం అమలు చేయాలని ప్రతినెల 5వ తేదిలోపు వేతనాలు చెల్లించాలన్నారు.స్కూల్ ఆయాలకు వేసవి సెలవుల్లో పనిచేసినందుకు సగం వేతనంకాకుండా పూర్తి వేతనం ఇవ్వాలన్నారు. కార్మికుల మీద పనిభారం తగ్గించాలన్నారు.