

పింఛన్లు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే విజయ్ కుమార్
జనం న్యూస్,జూలై01,అచ్యుతాపురం:
ఎలమంచిలి నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎలమంచిలి రూరల్ కొండ్రుబిల్లి,పులపర్తిలో
ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పర్యటన సందర్భంగా మహిళలు హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. కొండ్రుబిల్లి,పులపర్తిలో ఫించన్లు మరియు రైతులకు విత్తనాలు ఎమ్మెల్యే విజయ్ కుమార్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఒకటో తేదీ ఉదయమే ఇంటింటికి ఫించన్లు ఇస్తున్నామని,గత ప్రభుత్వంలో ఫించన్ పేరుతో ఏమీ చేసారో ప్రజలకు తెలుసు అని, రాష్ట్రంలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా, సకాలంలో ఫించన్లు ఇస్తున్నామని,ఒకటో తేదీ ఆదివారం వస్తే,ముందు రోజే ఫించన్లు అందిస్తున్నామని,ఇప్పటికే రెండు గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని, మహిళలకు ఉచిత బస్సు కూడా ఆగస్టు 15 నుండి అమల్లోకి వస్తుందని, తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తున్నామని, సంవత్సర కాలంలో ఎలమంచిలి నియోజకవర్గ గ్రామంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, గత ఐదు సంవత్సరాలు యాదాద్రి కాలవ ఎవ్వరు పట్టించుకోలేదని, ఎన్డియే పాలనలో యాదాద్రి కాలవ పనులు ప్రారంభించామని, కాలువ త్వరలోనే పూర్తి అవుతుందని,
అత్యథిక మెజార్టీతో గెలిపించిన ఎలమంచిలి నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ
పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
