

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 1 రిపోర్టర్ సలికినీడి నాగు
తహశీల్దార్ కి వినతిపత్రం అందచేత
ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ సమాజంలో ప్రజలకు జరిగే అన్యాయాలను గొంతు ఎత్తి నిలదీస్తున్న మీడియా సంస్థలపై దాడి చేసిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని చిలకలూరిపేట జర్నలిస్టులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో మహాన్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంలో కొంతమంది నేతలు మీడియా వ్యవస్థలను అనగా తొక్కాలని దురాలోచనతో ఇటువంటి నీచ చర్యలకు పాల్పడ్డారని చిలకలూరిపేట జర్నలిస్టులు తెలిపారు. ఈ సందర్భంగా చిలకలూరిపేట జర్నలిస్టులు ఎన్నార్టీ సెంటర్లోని మహాన్యూస్ ఛానల్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిరసన వ్యక్తం చేసి ఎన్నార్టీ సెంటర్ నుండి చౌత్రా సెంటర్, కళామందిర్ సెంటర్, విశ్వనాథ్ సెంటర్ మీదుగా స్థానిక తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తాసిల్దార్ కి వినతిపత్రం అందజేశారు. అనంతరం పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ మహాన్యూస్ ఛానల్ పై దాడి చేసిన వారిని ప్రభుత్వం వెంటనే శిక్షించి వారిపై చర్యలు తీసుకొని భవిష్యత్తులో మీడియా సంస్థలపై జర్నలిస్టులపై ఎటువంటి దాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని పై కూడా ఉందని తెలిపారు.