

జనం న్యూస్. జూన్ 30. సంగారెడ్డి జిల్లా. హత్నూర.
హత్నూర మండలంలోని మంగాపూర్ గ్రామ శివారులో అక్రమ కృత్రిమ ఇసుక డంపులను తహసిల్దార్ పర్వీన్ షేక్. రెవెన్యూ సిబ్బందితో కలిసి సోమవారం స్వాధీనం చేసుకున్నారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మంగాపూర్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ప్రభుత్వ అనుమతులు లేకుండా కృత్రిమ ఇసుకను తయారు చేస్తున్నారని తెలిపారు. వారికి అనుకూలమైన స్థలంలో ఇసుకను అక్రమంగా డంపులు చేసి రాత్రికి రాత్రే తరలిస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు ఇసుక డంపులను గుర్తించి స్వాధీన పరుచుకున్నట్లు తాసిల్దార్ తెలిపారు. స్వాధీన పరుచుకున్న ఇసుక దాదాపుగా 6 టిప్పర్ల వరకు కృతిమ ఇసుక ఉంటుందని తేల్చారు. స్వాధీన పరుచుకున్న ఇసుకను మంగాపూర్ గ్రామంలోని అర్హులైన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లకు ఉపయోగించాలని గ్రామ కార్యదర్శికి సూచించారు. ఎలాంటి అనుమతులు లేకుండా కృతిమ ఇసుక తయారు చేసి అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. వారి వెంట రెవెన్యూ అధికారులు ఆర్ ఐ హరిబాబు, సిబ్బంది ఉన్నారు.
