

జనం న్యూస్ జూలై 02 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
దీర్ఘ కాలం పంట అయినా ఆయిల్ పామ్ తోటలను సాగుచేసి నెలనెల నికర ఆదాయం పొందాలని పతంజలి ఫీల్డ్ ఆఫీసర్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మునగాల మండల పరిధిలోని తాడువాయి గ్రామంలో తోగరు శ్రీనివాస్ రావు వ్యవసాయ క్షేత్రం లో మేఘ ప్లాంటేషన్ కార్యక్రమం లో ఆయిల్ పామ్ మొక్కను నాటే కార్యక్రమం ను ప్రారంభించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న అయిల్ పామ్ తోటలను సాగు చేసినట్లు అయితే రైతులు ఆర్థికoగా అభివృద్ధి చెందవచ్చు అని అన్నారు.ఆయిల్ పామ్ తోటనాటిన నాలుగవ సంవత్సరం నుంచి దిగుబడి ప్రారంభమవుతుంది అని తెలిపారు.ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం బిందు సేద్యం,ఎరువులకి, అంతర పంటలకు రాయితీలు ఇస్తుందన్నారు.ఎరువులు మరియు అంతర పంటల యాజమాన్యానికి ఒక ఎకరానికి రూపాయలు 4200/- చొప్పున మొదటి నాలుగు సంవత్సరాలు ప్రోత్సాహకం గా డబ్బులు ఇవ్వబడుతుందని చెప్పారు.
నమ్మకమైన నీటి వసతి గల రైతులు లాభదాయకమైన ఆయిల్ పామ్ పంటను సాగు చేసి,అధిక ఆదాయం పొందవచ్చునని తెలిపారు. ఒక ఎకరానికి దిగుబడి పది టన్నుల వరకు వస్తుందనీ మొదటి నాలుగు సంవత్సరాల వరకు అంతర పంటలుగా ప్రస్తుతం మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న కూరగాయలను, వాణిజ్య పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.. ఆయిల్ పామ్ తోటలు సాగు చేయాలనుకున్న ఆసక్తి గల రైతులు ఉద్యాన శాఖ అధికారులకు దరఖాస్తు చేయలని కోరారు..ఈ కార్యక్రమంలో పతంజలి ఆయిల్ పామ్ కంపెనీ క్షేత్ర సహాయకులు సాయి,రైతు లు తోగరు శ్రీనివాస్ రావు, వెంకటేశ్వర్ రావు తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.
