Listen to this article

బిచ్కుంద జూలై 1 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో హర్ సైనిక్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఎక్స్ ఆర్మీ ఐ జి ఆఫీస్ సీఐ శివ నాథుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సైన్యంలో ఎంపికైన సైనికుల కుటుంబాలకు సైనికులకు సన్మానం, త్రివర్ణ పతాక జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ కొరకు తమ పిల్లలను ఆర్మీలో చేర్పించినందుకు తల్లిదండ్రులకు వందనం తెలిపారు. ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం ఎగరవేయాలని అన్నారు. ప్రతి సోల్జర్ కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. బిచ్కుంద మండలం నుంచి CRPF ప్రసాద్, తండ్రి బాబు చారి అనిత గారికి సన్మానం చేశారు అదేవిధంగా, నేవి సాయి కిరణ్ తండ్రి దేవిదాస్ పటేల్ తల్లి మీనా గారికి శాలువాతో సన్మానం చేసినారు, BSF సాయికుమార్ ల తల్లిదండ్రులు కూడా శాలువాతో సన్మానం చేశారు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్మీ సుబేదార్ రాములు, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ ఉపాధ్యక్షుడు యోగేష్, గల్లీ వాసులు, మహిళలు తదితరులు ఉన్నారు.