

జనం న్యూస్ జూలై 1 నడిగూడెం
విద్యార్థులకు ఇంటర్ బోర్డు సరఫరా చేసిన ఉచిత పాఠ్యపుస్తకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించాలని స్థానిక కేఎల్ఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డి.విజయ నాయక్ అన్నారు మంగళవారం కళాశాల ఆవరణలో విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరై మంచి మార్కులు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు జాని పాష, శ్రీధర్, మహేష్ కృష్ణ ,వీరన్న ,ఈశ్వర్ నాగరాజు, మదర్ ,శ్రీనివాస్ రజిత తదితరులు పాల్గొన్నారు.