

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 1 రిపోర్టర్ సలికినీడి నాగు
డెంగ్యూ మాసోత్సవం లో భాగంగా మున్సిపల్ ప్రాథమిక పాఠశాల పోలిరెడ్డి పాలెం నందు విద్యార్థిని విద్యార్థులకు ప్రైమరీ హెల్త్ సెంటర్ పోలిరెడ్డిపాలెం సిబ్బంది పి వెంకటేశ్వరరావు, టి,వెంకట్రావు అవగాహన కల్పించడం జరిగింది. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో పాఠశాల పరిసర ప్రాంతాలు మరియు ఇంటి ఆవరణ యందు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని నీటి తొట్లు,ఖాళీ కొబ్బరి బొండాలు, టైర్లులో నీరు నిల్వ లేకుండా ప్రతి ఒక్కరు గమనించాలని తెలిపారు,పగలు కుట్టే దోమల వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుంది కావున పరిసర ప్రాంతాల్లో దోమలు లేకుండా జాగ్రత్త వహించాలని చేతులు,కాళ్ళు పూర్తిగా కప్పి ఉంచే విధంగా దుస్తులు ధరించాలని తెలిపారు.పాఠశాల ఆవాస ప్రాంతంలో విద్యార్థులతో దోమల నివారణకు అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. పరిసరాల శుభ్రతే ఆరోగ్య భద్రత, వ్యక్తిగత శుభ్రత పాటిద్దాం ఆరోగ్యంగా ఉందాం, దోమల నివారణకు దోమతెరలు వాడాలి వంటి నినాదాలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది పాఠశాల ప్రధానోపాధ్యారాలు జె హేమావతి ఉపాధ్యాయులు పోటు శ్రీనివాసరావు కే అరుణ జి ఆదిలక్ష్మి సిహెచ్ నవ్యశ్రీ పాల్గొన్నారు