

జనంన్యూస్. 01.నిజామాబాదు. ప్రతినిధి.
ఇష్టారీతినా ఫీజులు వసూలు చేస్తూ, పబ్బం గడుపుతున్నటువంటి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు.. చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులు….
ఫీజు తల్లిదండ్రులకు భారంగా మారినప్పటికీ తమ పిల్లల భవిష్యత్తు ప్రైవేట్ పాఠశాల లోనే బాగుపడుతుందని భావించి, విద్య లేని వాడు వింత పశువు అన్న నానుడిని గుడ్డిగా నమ్మి అవస్థలు పడుతున్న తల్లిదండ్రులు. దీనిని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అధికంగా ఫీజు వసూలు చేస్తూ, విద్యను వ్యాపారంగా మార్చి, విద్యార్థులకు కావాల్సిన ప్రతిదీ తమ వద్దె కొనే విధంగా ప్రణాళికలు చేసుకొని,పాఠశాల అంటేనే ఒక వ్యాపార కేంద్రం అనేలాగా ప్రవర్తిస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు మాత్రం తమకేమీ ఎరగదు అన్నట్టు వివరించడం పట్ల AIPSU విద్యార్థి సంఘ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. పిల్లలను తమ వద్ద చేర్చినట్లైతే బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తామంటూనే సరియైన అర్హతలు లేని ఉపాధ్యాయులను తక్కువ జీతంతో చేర్చుకొని, పాఠశాలలో నడుపుతున్న వారందరూ ఉన్నారు. కొందరైతే విద్యార్థుల రవాణా సౌకర్యం కోసం ఏసీ బస్సులు అంటూ బస్సు అద్దాలకు రంధ్రాలు పెట్టి నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ నిబంధనలు పాటించినటువంటి పాఠశాలలు అడుగడుగునా వెలుస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని పాఠశాలలు తమ ర్యాంకుల కొరకు విద్యార్థులపై ఒత్తిడి తేవడంతో అనేకమంది విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక తనువు చాలిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలో లక్షలు చెల్లిస్తున్నప్పటికీ ప్రత్యేకంగా ట్యూషన్లు చెప్పించాలని, ఇంటి వద్ద తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తల్లిదండ్రులకు పాఠశాలల యాజమాన్యాలు ఆజ్ఞలు వేస్తున్నారు. కాబట్టి ఒకసారి తల్లిదండ్రులు ఆలోచించాలి, పాఠశాల అంటే కేవలం ప్రైవేట్ పాఠశాలనే కాకుండా ప్రభుత్వ పాఠశాలలు కూడా అద్భుతమైన విద్యా బోధనను అందించగలవని ప్రజలు తెలుసుకుని వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆర్థికంగా తాము కాస్తో కూస్తో కూడబెట్టి అదే డబ్బును తమ పిల్లల ఉన్నత విద్యకు,వారి భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా ప్రణాళికలు చేసుకోవాలని మనవి. ప్రభుత్వ ఆ పాఠశాలలో కూడా విద్యతోపాటు క్రీడల్లోనూ, సాంస్కృతిక సాహిత్య రంగాలలో ప్రతిభ కనబరిచే విద్యార్థులు లేకపోలేదు. దానితోపాటు ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం పథకం అమలుపరుస్తుంది. కావాల్సిన క్రీడా సామాగ్రి మరియు తమ పరిశోధనకు అవసరమైన ల్యాబ్స్, కంప్యూటర్స్, లైబ్రరీ వంటి సౌకర్యాలు కల్పిస్తుంది. కాబట్టి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని గడపగడపకు తిరిగి బడి _బాట కార్యక్రమాన్ని చేపట్టి తల్లిదండ్రులకు ప్రభుత్వం పిల్లల భవిష్యత్తు కోసం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని తల్లిదండ్రులకు వివరించి వారి మనసులను మార్చే విధంగా ప్రభుత్వ విధివిధానాలు ఉండాలని ఆకాంక్షిస్తూ… AIPSU విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి,బేగరి సాయికుమార్,