

జనం న్యూస్ జనవరి 25:- శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో అంబేద్కర్ యువజన సంఘం ఎ వై సి అంబేద్కర్ విద్యార్థి సమాఖ్య ఎ బి ఎస్ ఫ్ బహుజన సంఘం బి ఎస్ ఎస్ సంఘంల ఆధ్వర్యంలో ఆర్ ఐ మండలం ఎంపీడీవో ఫణి చంద్ర కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన
ఆరు పథకాలు ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ అత్యీయ భరోసా రైతు భరోసా నూతన రేషన్ కార్డులు నిరుపేదలుగ గుర్తించి లేనివారికి అందేలా చూడాలని అధికారులను కోరారు అధికార పార్టీ నాయకుల ప్రలోభాలకు ప్రజలు లొంగ వద్దని తెలిపారు అధికార పార్టీలో ఉన్నవారికి ఇండ్లు ఉన్నవారికి ఇండ్లు రేషన్ కార్డు ఉన్న వారికే రేషన్ కార్డు అనే రీతిలో కనుక జరిగినచో యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బహుజన సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మొగం సుమన్ ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా నాయకులు ప్రతాప్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కొంగర విజయ్ ప్రకాష్ బి ఎస్ ఎస్ నాయకులు ప్రసాద్ నాగుల కుమారస్వామి నాళిక రాజు తదితరులు పాల్గొన్నారు…..