Listen to this article

జనం న్యూస్,జూలై 02,అచ్యుతాపురం:


అచ్యుతాపురం మండలం పూడిమడక పంచాయతీ కొండపాలెం గ్రామానికి చెందిన చోడిపల్లి ఎర్రయ్య( 30) తండ్రి దేవుడు బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ప్రాంతంలో సముద్రంలో, ఎర్రయ్య మరి కొందరు మత్స్యకారులు చేపల వేట చేస్తూవుండగా ప్రమాద శాత్తు సముద్రంలో గల్లంతయ్యారు. తనతో పాటు వెళ్లిన మత్స్యకారులు యర్రయ్య మృతదేహంను వెతికినా కనిపించలేదని తోటి మత్స్యకారులు తెలిపారు.మత్స్యకార యువకుడు మృతి చెందిన సమాచారాన్ని స్థానికులు పోలీసులకు, మత్స్యశాఖ అధికారులకు,పంచాయతీ అధికారులకు తెలియజేశారు.