

టంగుటూరు సుపరిపాలన కార్యక్రమంలో మేడ విజయ శేఖర్ రెడ్డి.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగు తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయశేఖర్ రెడ్డి అన్నారు.బుధవారం నందలూరు మండలంలోని టంగుటూరు గ్రామంలో సుపరిపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకుని ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను మేడా విజయశేఖర్ రెడ్డి వివరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏడాది పాలన లో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు ఇంటింటికి చేరాయి అన్నారు. తల్లికి వందనం ఊహించిన విధంగా ఇంట్లో ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉన్నా అందరికీ డబ్బులు పడడంతో వారి కుటుంబాల్లో సంతోషాలు అవధులు దాటాయని అన్నారు. ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు వరం కానుంది అన్నారు. రాబోయే నాలుగు సంవత్సరాలు పేదరికం లేని రాష్ట్రంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ భువన బోయిన లక్ష్మీ నరసయ్య నాగిరెడ్డిపల్లి టంగుటూరు మదన మోహనపురం గ్రామ పంచాయతీల సర్పంచులు జంబు సూర్యనారాయణ షేక్ మైనుద్దీన్ చుక్క యానాది ఎంపిటిసి పెంచలయ్య తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ రాజంపేట నియోజవర్గ అధికార ప్రతినిధి కానకుర్తి వెంకటయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు షర్మిల గుజ్జల ఈశ్వరయ్య నాగభూషణం చుక్క కొండయ్య ధనుంజయ నాయుడు మట్టి బాబు మండెం నాగరాజు మాజీ ఎంపీటీసీ పటాన్ అక్బర్ ఖాన్ పుల్లయ్య సుగాలి వెంకటరత్నం ఆడుపూరు బాబు,రాజు,చుక్క వెంకటేష్ మంగళపూరి కొండయ్య చెన్నైగారి పల్లి సుబ్బ రాయుడు ఈడిగ పల్లె వెంకటసుబ్బయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.