Listen to this article

జనం న్యూస్ జూలై 2 (నడిగూడెం)

మండల పరిధిలోని కాగిత రామచంద్రపురం గ్రామ శివారులో అనుమానాస్పద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం బుధవారం లభ్యమైంది. కే ఆర్సీపురం గ్రామ శివారు లోని ఒక నీటి కుంట లో గుర్తు తెలియని వ్యక్తి (30) మృతదేహం ఉందనే గ్రామస్థులు సమాచారంతో నడిగూడెం ఎస్.ఐ అజయ్ కుమార్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మడుగులో నుంచి పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో వున్న మృతదేహాన్ని గ్రామస్తుల సహాయంతో బయటకు వెలికి తీశారు.మృతదేహాన్ని సగభాగం ప్లాస్టిక్ బస్తాలో మూటగట్టి మడుగులో పడేసి ఉండటంతో హత్యగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుమారు నాలుగుల రోజుల క్రితం ఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృత దేహానికి కుడి చేతికి స్టిల్ కడియం, గులాబీ రంగు చొక్కా, లైట్ బ్లాక్ కలర్ ప్యాంట్, బీడీ ప్యాకెట్ ఉన్నట్లు పోలీస్ లు తెలిపారు. సమాచారం తెలిసిన వారు మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ నెం 8712686011 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. పోస్టుమార్టం కొరకు మృతదేహాని కోదాడ ప్రభుత్వ హిస్పిటల్ కు తరలించారు.