

జుక్కల్ జులై 3 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని వివిధ గ్రామాల గ్రామపంచాయతీ కార్మికుల ప్రతినిధులతో కలిసి సీఐటీయూ ఆధ్వర్యంలో జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ గారికి ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో గ్రామపంచాయతీ కార్మికులందరూ పాల్గొంటున్నామని తెలియజేస్తూ సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు సురేష్ గొండ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక. కర్షక. ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక సంఘాల పిలుపు మేరకు జులై 9న జరిగే గ్రామీణ భారత్ బంద్ ఒక్కరోజు జరిగే సమ్మెలో. జుక్కల్ నియోజకవర్గంలోని. రైతులు. కార్మికులు. ఉపాధి హామీ. ఫీల్డ్ అసిస్టెంట్లతో పాటు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా నియోజకవర్గ కార్మిక కర్షకులకు సిఐటియు. జిల్లా నాయకులు సురేష్ గొండ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికుల సంఘం. మండల అధ్యక్షులు. గోవింద్. ప్రధాన కార్యదర్శి. మేత్రి. గంగారం. జూకల్. టౌన్ అధ్యక్షులు. జాదవ్. వీరయ్య. కార్యదర్శి. షేక్.. ఆశు ఖాన్. పండరి. కార్మికులు. జ్ఞానేశ్వర్. సాయిలు. సతీష్. లక్ష్మణ్. గంగాధర్. తదితరులు పాల్గొన్నారు