Listen to this article

జనం న్యూస్:3 జూలై గురువారం ;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;

సిద్దిపేటకు చెందిన పేరణి నాట్యచార్యులు రమేష్ లాల్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ ప్రతిభా పురస్కారానికి నృత్యం విభాగంలో ఎంపిక కావడం పట్ల జాతీయ సాహిత్య పరిషత్ కవులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిద్దిపేటలోని మహాత్మా గాంధీ పార్కులో రమేష్ లాల్ కు అభినందనలు తెలిపి, సత్కరించారు. కార్యక్రమంలో ఐతా చంద్రయ్య, ఎన్నవెళ్లి రాజమౌళి, ఉండ్రాళ్ళ రాజేశం, సింగీతం నరసింహారావు, కాల్వ రాజయ్య, నల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.