Listen to this article

జనం న్యూస్ జులై 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని పెద్ద కోడాపాక గ్రామంలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బీరన్న బోనాలను గ్రామ ప్రజలు ఆడపడుచులు మహిళలు ఘనంగా నిర్వహించుకుంటారు బోనాలను ఎత్తు కొని గొల్ల కురుమల ఆరాధ్య దైవంగా కొలిచే వీరన్న దేవాలయానికి చప్పుల్లా మధ్య ఊరేగింపు గా తరలి వెళ్లి గొర్రెల తోడేళ్ళు ను స్వామి వారి కి బలి ఇచ్చి సమర్పించి తమ మొక్కులను. చెల్లించుకుంటారు గ్రామంలో పాడిపంటలు సమృద్ధిగా పండి ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూడాలని వీరన్న స్వామి వేడుకుంటామని తెలంగాణా జాగృతి యువత రాష్ట్ర కార్యదర్శి అమ్మ అశోక్ తెలిపారు ఈ కార్యక్రమంలో చిట్టి రమేష్ అమ్మ రాజు రవి ముజ్జిరి వేణు అమ్మ రంజిత్ శివ అశోక్ తదితరులు పాల్గొన్నారు…..