Listen to this article

జనం న్యూస్ 04 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం స్థానిక అయ్యన్నపేట కూడలిలో ఉన్న నడక మైదానం వద్ద అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం సందర్బంగా క్లబ్ అధ్యక్షులు తాడ్డి ఆదినారాయణ ప్లాస్టిక్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వాకర్స్ క్లబ్ గౌరవ సలహాదారులు, డిస్ట్రిక్ట్ 102 ఎలక్ట్ గవర్నర్ ఎ. తిరుపతి రావు మాట్లాడుతూ..ప్లాస్టిక్ సంచులు మన దైనందిన జీవితంలో విస్తృతంగా ఉపయోగించే భాగమయిందని, అవి పర్యావరణ కాలుష్యానికి ప్రధాన మూలమని, అవి విచ్ఛిన్నం కావడానికి సుమారు 500 సంవత్సరాల వరకు పట్టవచ్చు,కాబట్టి అవి నేల మరియు నీటిలో పేరుకుపోయి పర్యావరణ వ్యవస్థలకు మరియు సముద్ర జీవులకు హాని కలిగిస్తాయని తెలిపారు. ముందు మనమంతా ప్లాస్టిక్ సంచులను వాడకాన్ని నిషేధించి, రాబోయే తరాలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన సమాజాన్ని రూపొందించడంలో మనవంతు కృషి చేద్దామని అన్నారు.
కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి ఐ.వి.ప్రసాదరావు,ఉపాధ్యక్షులు వల్లూరి శ్రీనివాసరావు, క్లబ్ సీనియర్ సభ్యులు కోట్ల సత్యనారాయణ,పి. అప్పలరాజు, జి. ప్రకాశరావు, కె. రమేష్ తదితర క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.