Listen to this article

సోహం వాస్తు ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు డాక్టర్ సంతోష్,

జనం న్యూస్,జులై 04,కంగ్టి

సంగారెడ్డి కంగ్టి మండల పరిదిలోని పిఎం దమరగిద్ద గ్రామనికి చెందిన సోహం వాస్తు ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు డాక్టర్ సంతోష్,చిన్న సన్న కారు రైతు కుటుంబంలో జన్మించి అనేకమైన ఒడిదోడుకులను చవి చూసి,ఆయుర్వేదాన్ని అధ్యయనం చేసి ప్రభుత్వం నుంచి గుర్తింపు పొంది మానవతా దృక్పథంతో తమ ప్రాంత ప్రజలకు అత్యుత్తమ సేవలను అందించాలన్న సదుద్దేశంతో సోహం వాస్తు ఆయుర్వేదిక్ వైద్యని ప్రారంభించడం జరిగింది అన్నారు. శుక్రవారం తన సొంత నివాసంలో ఆయన మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు తమ రుగ్మతుల కొరకై లక్షల రూపాయలు ఆస్పత్రుల్లో ఖర్చులు పెట్టలేని నిరుపేద బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలతో పాటు,అతి తక్కువ ఖర్చుతో శారీరక,మానసిక రుగ్మతులకు ఆయుర్వేద ఔషధములతో ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తున్నారు.వైద్యం లేక కాదు. ఆదరించేవారు లేక. స్వచ్ఛంద సేవా సంస్థలు,సంఘాలు మాయమైపోతాయి. డబ్బు లేక కాదు. కార్యకర్తలు లేక.గొప్ప గొప్ప గ్రంథాలు, గ్రంథాలయాలు మట్టిలో కలిసిపోతాయి.చదువు రాని వారు లేక కాదు. చదివే వారు లేక. అందరూ ఒంటరైపోతారు. కుటుంబం లేక కాదు,గూగుల్ కోట నుంచి బయటకు రాలేక,ఒక్కొక్క గుండె ఆగిపోతుంది.వాయువు లేక కాదు. ప్రాణవాయువు లేక. అని సర్వసభ్య సమాజానికి హితోపదేశం చేశారు.