

(జనం న్యూస్ జూలై 04 భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి)
భీమారం మండలం తాసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం రోజున తాసిల్దార్ సదానందం కు మహా న్యూస్ పై దాడి గురించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు కాజీపేట రవి కోశాధికారి నంది శివ, జన సముద్రం న్యూస్ సిరిపురం మధు మాట్లాడుతూ ఛానల్ ఆఫీసులపై దాడి పత్రికా స్వేచ్ఛను హరించడమే ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే మీడియాకు మీరు ఇచ్చే విలువ ఇదేనా .ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి మీడియానే. ప్రజలకు, ప్రభుత్వాలకు, ప్రతి పక్షాలకు, మధ్య వారధిగా ఉంటూ నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పని చేసే మీడియా కార్యాలయాలపై విలేకరులపై అమానుషంగా దాడి చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనని, కొన్ని రోజుల నుండి కొన్ని న్యూస్ చానల్స్ పై జరిగే దాడిని తీవ్రంగా ఖండించారు . కష్ట నష్టాలు కోర్చి వ్యయ ప్రయాసాల కోర్చి నిరంతరం ప్రజా సమస్యలను ప్రభుత్వాలకు తెలియజేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలిసేలా ప్రజా సంక్షేమాలను గాలికి వదిలి దుష్ట రాజకీయాలు చేసే రాజకీయ నాయకుల బండారాలను బయట పెడుతూ తమ జీవితం గురించి ఆలోచించకుండా ఎదుటివారి జీవితాలు బాగుండాలనే తపనతో 24 గంటలు పని చేసే మీడియాపై గుండాల్లాగా దాడి చేయడం చాలా హేయమైన చర్యని అన్నారు. రాజ్యాంగానికి విరుద్ధమైన పనులు చేసే వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని లేదంటే పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు మీడియాపై దాడి చేసిన వారు ఎంతటి వారైనా సరే ప్రభుత్వం వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని తెలిపారు మీడియాపై గౌరవం ఉన్నవారు ప్రజా స్వామ్య వాదులు ప్రభుత్వ పెద్దలు తక్షణమే స్పందించి పోలీసు అధికారులు కూడా దాడి చేసిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు