Listen to this article

జనం న్యూస్ జూలై 4 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో కూకట్ పల్లి భాగ్యనగర్ కాలనీ మెయిన్ రోడ్ లో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ, కాంగ్రెస్ యూత్ నాయకులు గూడెపు నాగరాజు, ఆసిఫ్ ఖాన్, సునీల్ యాదవ్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొని పూలు పూలమాలలు వేసిఘన నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వెన్నులో వణుకు పుట్టించిన మహా యోధుడు.. మన్యం ప్రజల ఆరాధ్య దైవం అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని అని కొనియాడారు.