Listen to this article

బిచ్కుంద జులై 4 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు హరితహారం కార్యక్రమంలో భాగంగా బిచ్కుంద మున్సిపాలిటీ కమిషనర్ షేక్ హయ్ం మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జునప్ప హరితహారం కార్యక్రమం చేపట్టారు మల్లికార్జున అప్ప చెట్లు నాటిన అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చెట్లని నాటి పెంచి ప్రకృతిని కాపాడు కోవలసిన బాధ్యత అందరి పైన ఉందని ప్రతి ఒక్క ఇంటి వద్ద చెట్లు ఉండే విధంగా చూడాలని బిచ్కుంద మున్సిపల్ కమిషనర్ ని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి డెలికేట్ విట్టల్ రెడ్డి, బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ ,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాయిల్ సెట్ కార్, సీమ గంగారం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయిని అశోక్, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ ఉపాధ్యక్షుడు యోగేష్, మైనార్టీ నాయకుడు నయం, నాగరాజ్ సెట్, సంజు సెట్ కార్, సాయిని బసవరాజ్ తుకారం ,గంగాధర్ పటేల్, చింతల్ హనుమాన్లు కాంగ్రెస్ కార్యకర్తలు మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు