Listen to this article

జనం న్యూస్ జూలై 04 వికారాబాద్ జిల్లా రిపోర్టర్

వికారాబాద్ జిల్లా పరిగి పట్టణం పాలసీతలీకరణ కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాటయోధుడు,తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ) పూడూరు మండల అధ్యక్షులు దేవనోనిగూడెం వెంకటన్న, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు ఎరన్ పల్లి శ్రీనివాస్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి గోవింద్ నాయక్ లు మాట్లాడుతూ భూమికోసం, భుక్తి కోసం,వెట్టిచాకిరి విముక్తి కోసం నిరంతరం నిజాం మరియు దొరలు,భూస్వాములతో పోరాటం చేసి దున్నేవాడిదే భూమి అంటూ నినాదంతో ప్రజల హక్కుల కోసం పోరాటం చేసిన మహాయోధుడు యువతకు ఆదర్శప్రాయుడు అతని ఆశయ సాధనకై యువత ముందుకు నడవాలని పిలుపునివ్వడం జరిగింది. నిజాం రాజు  మరియు దేశముక్ విసునూరు రామచంద్రారెడ్డి  దొర గుండాల తుపాకీ తూటాలకు నేలరాలిన అరుణతార, భయం ఎందుకు తెలంగాణ విప్లవంలో చెరగని ముద్ర వేసుకున్న విప్లవోద్యమకారుడు కాబట్టి వారి ఆశయ సాధన కోసం అందరూ ఐక్యమత్యంగా పోరాటం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం దోమ మండల అధ్యక్ష కార్యదర్శులు సత్తయ్య ,రఘురాం, అంబేద్కర్ సంఘం నాయకులు సాలేటి వెంకట్,వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రామచంద్రయ్య, రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.