Listen to this article

ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ

జనం న్యూస్,జూలై05,అచ్యుతాపురం:

అచ్యుతాపురం మండలంలోని పూడిమడక గ్రామంలోని కడపాలెంలో శుక్రవారం ఉదయం సుపరి పాలన తొలి అడుగు ఇంటింటికీ టిడిపి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎలమంచిలి నియోజకవర్గ ఇన్చార్జి మరియు రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరావు సూచన మేరకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ మేరుగు బాపునాయుడు ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. పెన్షన్‌, గ్యాస్‌ సబ్సిడీ, తల్లికి వందనం తదితర సంక్షేమ పథకాలు అందాయా అని టీడీపీ నాయకులు లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తున్నారని టీడీపీ నాయకులు బాపునాయుడు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు మేరుగు వెంకట రావు,సమ్మంగి లక్ష్మణ, కోవిరి బంగారయ్య క్లస్టర్ ఇంచార్జ్,మేరుగు మహేష్,
ఉమ్మిడి కొండయ్య,దాసరి శ్రీను,యజ్జల శ్రీరామ్, బీడుబాబు,మేరుగు తాతాజీ మరియు పలువురు టిడిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.