

జనం న్యూస్ 05జులై పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా
పెగడపల్లి మండలం లో వన మహోత్సవాన్ని కార్యక్రమం లో భాగంగా ప్యాక్స్ ఛైర్మెన్ ఒరుగంటి రమణారావువన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్ర వారం నాడు జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఏక్ పెడ్ మా కే నామ్ ‘ ( మన తల్లి పేరిట ఒక మొక్క నాటుదాం) కార్యక్రమాన్ని పెగడపల్లి ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో నిర్వహించారు అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 ను పురస్కరించుకొని సహకార సంఘ పరిధిలో శుక్రవారం నాడు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. సహకాసనం చైర్మన్ రమణారావు మొక్కలు నాటి ప్రారంభించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని ఆయన కోరారు. ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘ0 ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. సహకార సంఘా పరిధి లో ఉన్న ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రభాకర్ రెడ్డి పీఏసీఎస్ కార్యదర్శి గోపాల్ రెడ్డి మాజీ ఎంపీపీ సత్తయ్య నాయకులు రాజేశ్వరరావు శ్రీనివాస్ కనకయ్య లక్ష్మీనారాయణ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.