Listen to this article

(జనం న్యూస్ చంటి జులై 4)

ఈరోజు దౌల్తాబాద్ మండలం దొమ్మాట గ్రామంలో దుబ్బాక నియోజకవర్గంలో శ్రీ కొడకండ్ల శ్రీరామ్ చరణ్ శర్మ గారి ఆశీస్సులతో నియోజకవర్గం స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. వివిధ గ్రామాల నుండి క్రీడాకారులు వచ్చి ఆటలు ఆడడం జరిగింది. ఇందులో ఓటమి గెలుపులో సహజమని శ్రీరామ్ చరణ్ శర్మ అన్నారు. ఆటల్లో ఓడిపోవడం గెలుపు పొందడం ఒకటేనని అందరూ మంచి స్థాయికి ఎదగాలని మునుముందు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మీరు ఆడాలని వారు అన్నారు. ఇందులోఆటలాడిన వారికి బహుమతులు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా వారికి సహకరించడం జరిగింది. ఫస్ట్ విన్నర్ దొమ్మాట క్రీడాకారులు . 20000 బహుమతి గెలుపొందడం జరిగింది. సెకండ్ విన్నర్ దుబ్బాక వారికి పదివేల రూపాయలు బహుమతి పొందడం జరిగింది. ఇందులో ఆడిన వారికి బెస్ట్ విన్నర్ & మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. దీనికి నిర్వాకులు. మాజీ సర్పంచ్ కొమ్మెరపూజిత. వెంకట్ రెడ్డి మరియు పాలకవర్గం. మరియు ఇందులో పాల్గొన్నవారు.ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి .మరియు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్య. రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్. హైమద్. సింహాచలం యువకులు క్రీడాకారులు పాల్గొనడం జరిగింది.