

దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ
జనం న్యూస్ 4జూలై: కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.
కొమురయ్య జీవితం త్యాగానికి, పోరాటానికి ప్రతీక అని కొనియాడారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఆయన చేసిన సాయుధ పోరాటం తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని పేర్కొన్నారు.దొడ్డి కొమురయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు. భూస్వాములు, నిజాం నిరంకుశత్వం, వెట్టి చాకిరిలకు వ్యతిరేకంగా పోరాడి, కడవెండి గ్రామంలో విసునూర్ దేశ్ముఖ్ రౌడీల కాల్పుల్లో 1946 జులై 4న మరణించాడు ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.కొణిజెటి రోశయ్య జయంతి సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ రోశయ్య గారు రాజకీయాలకు అతీతంగా అందరి మన్ననలు పొందిన గొప్ప నాయకుడని అన్నారు. ఆర్థికవేత్తగా, శాసనసభ్యుడిగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. విలువలతో కూడిన రాజకీయాలకు రోశయ్య గారు నిదర్శనమని, ఆయన పరిపాలనా దక్షత యువతరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఈ ఇద్దరు మహనీయుల సేవలను స్మరించుకుంటూ, వారి ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దొత్రే, జేసీ డేవిడ్,జిల్లా అధికారులు,స్థానిక ప్రజా ప్రతినిధులు, సంఘ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.