

జనం న్యూస్ జూలై 05(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
మునగాల మండల పరిధిలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సూర్యాపేట జిల్లా ఇంచార్జ్ డిఎంహెచ్వో చంద్రశేఖర్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు.సమయానికి విధులకు హాజరయ్యి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు తెలిపారు. ముఖ్యంగా ఆసుపత్రిలో నార్మల్ డెలివరీ లు యాలని,ప్రస్తుతం వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు సమయానికి అందించాలని,డయేరియా
నుoడి నివారించడానికి జింకు మాత్రలు,ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఇప్పించాలని,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆరోగ్య కార్యక్రమాలన్నింటిని . ప్రజలకు అందించాలని అన్నారు.అన్ని ప్రోగ్రామ్స్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు..ఆస్పత్రి ఆవరణలో ఎక్కువగా మొక్కలు నాటించాలని తెలిపారు.. రోగుల నుండి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు.వీరి వెంట డిప్యూటీ డిఎంహెచ్వో జయా మనోహరీ, ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వినయ్ కుమార్,హెల్త్ సూపర్వైజర్ జయమ్మ,నర్సింగ్ ఆఫీసర్ సునీత,ల్యాబ్ టెక్నీషియన్ ఫణిందర్ ఏఎన్ఎం బి పద్మ ఉన్నారు.