Listen to this article

జనం న్యూస్,జూలై04,అచ్యుతాపురం:


అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామ పంచాయితీ కొండపాలెం గ్రామానికి చెందిన చోడిపల్లి ఎర్రయ్య (26) అనే మత్స్యకారుడు బుధవారం సముద్రంలోకి చేపల వేటకు వెళ్లి కొమ్ము కోనాం తీసే ప్రయత్నంలో దాడిలో చనిపోవడం జరిగిందని,మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి,ఎర్రయ్య మృతుదేహం లభ్యం కోసం కోస్ట్ గార్డు సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టి బంధువులకు అంద చెయ్యాలని వారి కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకోవాలని మత్స్యశాఖ మరియు సంబంధిత అధికారులను ఆంధ్రా మత్స్యకార జేఏసీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు అర్జిల్లి అప్పలరాజు ఫోన్ లో కోరారు.స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మరియు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మృతుడి కుటుంబానికి అండగా ఉండాలని అప్పలరాజు కోరారు. అచ్యుతాపురం మండల అధ్యక్షుడు మేరుగు నూకరాజు మాట్లాడుతూ..ఎర్రయ్య చనిపోవడంతో కుటుంబ భారం మొత్తం తన తమ్ముడిపై పడిందని, నాన్న 5 ఏళ్ళ కిదట చనిపోయారు.తల్లి పింఛను పై ఆధారపడి జీవిస్తుతుందని,ఎర్రయ్య కు ఒక అక్క, చెల్లి కూడా ఉందని త్రిసభ్య కమిటీ వేసి విచారణ చేసి మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరుపున ఆర్ధికంగా అండగా ఉండాలని,ఏదైనా ప్రమాదాలు జరిగి చనిపోయినప్పుడు చేపలు వేటకు వెళ్తున్న ప్రతీ మత్స్యకారుడుకి రూ. 30-50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ను ప్రభుత్వం చేయించాలని కోరారు.కోరడం జరిగింది.అలాగే నూతనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడుగా ఎన్నికైన పివిఎన్ మాధవ్ కూడా చొరవ తీసుకొని మత్స్యకారలకు న్యాయం చెయ్యాలని కోరారు.ఈ యొక్క కార్యక్రమంలో మత్స్యకార నాయకులు, మత్స్యకారులు పాల్గొన్నారు.