

జనం న్యూస్ జూలై 05(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
కోదాడ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ పిడమర్తి గాంధీ ఎన్నికయ్యారు. పట్టణంలోని వాగ్దేవి కళాశాలలో శుక్రవారం మాజీ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంజన్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గాంధీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు గాంధీ మాట్లాడుతూ.. జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సహకరించిన మీడియా పెద్దలకు కృతజ్ఞతలు తెలియపరిచారు. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి వద్దకు చేర్చి పరిష్కారం అయ్యేలా చొరవ చూపిస్తా అని అన్నారు. అందరిని సమన్వయ పరిచి సమస్యలు పరిష్కరిస్తానన్నారు. రిపోర్టర్లు పూర్ణచందర్రావు, కుడుముల సైదులు, చింతలపాటి సురేష్, వెంకటనారాయణ, గంధం రాము, తోటపల్లి నాగరాజు, శ్రీకాంత్, లక్ష్మణ్, మధు, గోపాలకృష్ణ, చంద్రశేఖర్, పడిశాల నాగరాజు, మార్కాపుడి సంపత్, వాసు, నజీర్, సత్యరాజు, రామారావు, సునీల్, బుచ్చి రాములు, సతీష్,వెంకన్న, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు….