Listen to this article

జనం న్యూస్ జూలై 04:నిజామాబాద్ జిల్లా

ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామానికి చెందిన కూతురు ఆశన్న కు చెందిన గర్భంతో ఉన్న సుమారు 80వేలు విలువ చేసే గేదె విద్యుత్ షాక్ తో మృతి చెందింది. ఆశన్న ఇచ్చిన సమాచారం మేరకు వెటర్నరీ ఎల్ ఎస్ ఏ నరేందర్, బట్టా పూర్ ట్రాన్స్ కో లైన్ మెన్ సర్వేశ్వర్ బాదితుడితో కలిసి పంచనామా నిర్వహించారు.ఇంకో పది రోజులైతే గేదె ప్రసవిస్తుండేనని ఇంతట్లోనే గేదె విద్యుత్ షాక్ తగిలి మృతిచెందడం తమ దు రదృష్టమని గేదె యజమాని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నిరయ్యారు.