

జనం న్యూస్ జూలై 5 ముమ్మిడివరం ప్రతినిధి
ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని ఐ.పోలవరం మండలం మురమళ్ల పుష్కర ఘాట్ వద్ద తొమ్మిది కిలోల గంజాయిని ఐ పోలవరం పోలీసులు స్వాధీనం చేసుకుని నలుగురు యువకులను అరెస్టు చేశారు.
దీనికి సంబంధించి ముమ్మిడివరం సిఐ ఎం మోహన్ కుమార్ తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి. మురమళ్ల పుష్కర ఘాట్ వద్ద గంజాయి కలిగి నలుగురు యువకులు ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించి నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 9 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన నలుగురిలో ముగ్గురు పాత నేరస్థులుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరొక వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గంజాయి కలిగి ఉన్నా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. జిల్లాలో గంజాయి నిరోధానికి కఠిన చర్యలు తీసుకుంటామని, అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదని సీఐ స్పష్టం చేశారు. ఈ ఘటనపై ముమ్మిడివరం సీఐ ఎం మోహన్ కుమార్ ఆధ్వర్యంలో ఐ పోలవరం ఎస్సై ఎంవివి రవీంద్రబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
