

జనం న్యూస్ జులై 05 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటి గ్రామంలో మహిళలకు టైలరింగ్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించి వారిలో ఆర్థిక పరిపుష్టి కల్పించడమే వసుధ స్వచ్చంధ సేవా సంస్థ లక్ష్యమని సేవా సంస్థ మెంబర్ ఉమా తెలిపారు.ఈ సందర్భంగా కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ చిత్తరంజన్ మాట్లాడుతూ మహిళల్లో ఆత్మ గౌరవం ఆర్థిక స్వావలంబన సాధించే లక్ష్యంతో ఈ ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందదాయకం అన్నారు ఈ కార్యక్రమంలో అచ్చేశ్వర్రావు ( ఎ ఎస్పీ వరంగల్ జోన్ ఎన్ఫార్మెంట్), సొల్లు లక్ష్మీ,ఎస్ ఐ చంద్రశేఖర్ ,శిక్షణపొందనున్న మహిళలు, గామా ప్రజలూ పెద్దఎత్తున పాల్గొన్నారు.