Listen to this article

జనం న్యూస్ జులై 5, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి

: పట్టణంలో ఈ రోజు డా.ఎల్లాల అంజిత్ రెడ్డి మండల వైద్యాధికారి ఆధ్వర్యంలో మెట్టుపల్లి పట్టణ పరిధిలోని పలు ఆర్ఎంపీల క్లినిక్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అంజిత్ రెడ్డి మాట్లాడుతూ ఆర్ఎంపీలు పరిధిని దాటి వైద్యం చేయకూడదని రోగులకు సలైన్లు పెట్టడం, ఇంజక్షన్లు చేయడం, అతిగా అనవసరమైన ఆంటీబయాటిక్ లాంటి మాత్రలు వినియోగించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడకూడదని, రోగులకు ప్రథమ చికిత్స మాత్రమే అందించాలని క్లినిక్ బోర్డుల పైన ప్రథమ చికిత్స కేంద్రము అని మాత్రమే ఉండాలని అన్నారు. ఆర్ఎంపీలు తమ పరిధి దాటి చికిత్స అందించినట్లయితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ తనిఖీల్లో సూపర్వైజర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.