Listen to this article

మరణ ధ్రువపత్రం వెంటనే ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలి

జనం న్యూస్,జూలై 05,అచ్యుతాపురం:


అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమాడక గ్రామం కొండపాలెంకు చెందిన చోడిపల్లి ఎర్రయ్య అనే మత్స్యకారుడు తోటి మత్స్యకారులతో కలిసి జూలై 2న చేపల వేట వెళ్ళాడు.యర్రయ్య చేపను తీసే తరుణంలో సముద్రంలో గల్లంతు అయ్యారు. తోటి మత్స్యకారులంతా గాలింపు చర్యలు చేపట్టినా నేటి వరకు గల్లంతైన మత్స్యకారుడి ఆచూకీ లభ్యం కాలేదని,రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుడి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని,మరణ ధ్రువపత్రం వెంటనే ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి మరియు విపత్తుల శాఖ మంత్రి వంగలపూడి అనితకు పాయకరావుపేట నియోజకవర్గ టిడిపి మత్స్యకారులు వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార టిడిపి సీనియర్ నాయకులు బొంది కాశీ విశ్వనాథ్, గోసాల తాతారావు,కారే కృష్ణ,పిక్కి రాంబాబు, గరికిన సింహాద్రి, వాసుపల్లి అడివిరాజు, వాసుపల్లి శివ,సిరిపల్లి అప్పలరాజు,కారే ధనరాజు తదితరులు పాల్గొన్నారు