

మద్నూర్ జూలై 5 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం భవన నిర్మాణం చేసేందుకు అధికారులు స్థలాన్ని పరిశీలించారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, కేంద్రీయ విద్యాలయ రాష్ట్ర కమిషనర్ మంజునాథ్ జిల్లా, మండల స్థాయి అధికారులు, సిబ్బందితో కలిసి మద్నూర్ లోని ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. పాఠశాల ప్రారంభం చేయడానికి తాత్కాలిక భవనంతో పాటు శాశ్వత భవనం నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపిస్తున్నామని తెలిపారు. వారితో పాటు తహసీల్దార్ ముజిబ్, డిఈఓ రాజు, మండల రెవెన్యూ విద్యాశాఖ అధికారులు ఉన్నారు.
