

జనం న్యూస్ ;5జూలై శనివారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్
;సిద్దిపేట జిల్లాలోని గుర్రాలగొంది గ్రామంలోని అభయాంజనేయ దేవస్థాన అన్నదాన భవనంలో శనివారం కవయిత్రి మంచినీళ్ల సరస్వతి రామశర్మచే అవధానం జరిగింది. ప్రాశ్నికులు అడిగిన అంశాలపై వివిధ ఛందస్సులలో పద్యాలు అందించి, అలరించారు. తెలుగు సాహిత్యానికి ప్రాణమైన అవధానం గ్రామాలలో కూడా జరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అవధానంలో ప్రముఖ కవులు ఉండ్రాళ్ళ రాజేశం, సింగీతం నరసింహారావు, వరుకోలు లక్ష్మయ్య, పెందోట వెంకటేశ్వర్లు, నల్ల అశోక్, ఆదిమూలం చిరంజీవి, కాల్వ రాజయ్య, కోణం పర్శరాములు, దుబ్బాక తిరుపతి ప్రజాప్రతినిధులు పటేండ్ల లచ్చయ్య, శాతాజుపల్లి ఆంజనేయులు, ఆకుల హరీష్, ఉండ్రాళ్ళ తిరుపతి, గరిపల్లి అంజయ్య, తులసి, సతీష్, సుమేష్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.